Wednesday, 21 October 2026

Stay with me buddy!

 


కలవడం, విడిపోవడం మన చేతిలో ఏముందిరా బాబు అని అనుకునే వాడిని కులాసాగా..
మనిషి దూరం అయినా వాళ్ళ ఆలోచనలు మనల్ని ఎప్పుడూ కలవరపరుస్తూనే ఉంటాయి కదా..

మేము కలిసి మాట్లాడుకొని ఎన్నాళ్ళయ్యిందో అని మనసు ఆరాటపడుతోందిగా..
తనని చూసి గంట కూడా అవ్వలేదురా అంటూ తిట్టి పారేసింది బుర్ర ఎకసెక్కాలుగా..

కళ్ళల్లో కనిపిస్తున్న ఆ చిరు వెలుగు కోసమే కలిసాను తనని ఇవాళ తాను మల్లి కనుమెరుగయ్యేలోగా..
నను చుసిన వెంటనే తన కళ్ళలో విరిసిన జ్వాలలు నన్ను విసరమన్నాయి పడుచు బాణాలు తన మనసుని తాకేలాగా..

నిన్ను చూడగానే మనసు మాయమయిపోయింది, మాట మౌనం అనే చెరలో చిక్కుకున్నది, కదలిక శూన్యం వైపు పరుగు తీసింది..
నీ నవ్వు నాలోని భావాలని మసక మసకగా నీ ముందుంచి సర్దుకు పోయింది..

మాట అడిగాను తాను 'నా సైన్యం' అవుతుందా, నాతో కలిసి ఒక ఉప్పెన లాంటి ప్రయాణంలో తోడుంటుందా అని..
తన మృదువైన చేతులు కందిపోతాయి అని తెలిసినా కూడా 'నా భరోసా నీకే', కానీ కాస్త సమయం కావాలని అంది..

తన మాటలు నాకు లక్ష మంది సైనికుల్ని జయించి నా రాజ్యాన్ని కాపాడినంత బలం ఇచ్చింది అలా..
ఇంతకూ తాను ఎవరు అనుకుంటున్నారు కదూ..తనే అండి మన శ్వేతవన్నెల యువరాణి, కాస్త రావే ఇలా..

నీ ముసి ముసి నవ్వులని కాసేపైనా ఆస్వాదించనీకుండా అలా అడ్డు పెట్టేస్తావే నీ హస్తాలని..
పసి హృదయం నీది, ప్రళయం లాంటి ఆలోచన నాది, కలిసి వెలిగిద్దాం కోటి దీపాల కాంతులని..

సమయమా నీకు వదిలేస్తున్నా, నా ప్రయత్నమా నిన్ను ఆర్జిస్తున్నా..
పయనమా పద పద అంటున్నా, పారిపోక నా వెన్నంటే ఉండి నన్ను నడిపించుమా..!! :)


No comments:

Post a Comment