Sunday, 18 October 2026

A guy's last lines to his girlfriend .. FOR ONE LAST TIME ! #TeluguPoetry 💔




ఆకాశమంత ప్రేమ ఉందని అన్నావే..
అర నిమిషమైనా ఆలోచించకుండా నను విడిచి వెళ్ళిపోయావే...

బ్రతుకంతా భారమని అన్నావే, నేను లేకుండా ఉండలేను అన్నావే..
భరించలేనంత బాధని నాకిచ్చి వెళ్ళిపోయావే...

నీ పరిచయమే నాకొక వరం అన్నావే, నువు లేకుండా ప్రపంచమంత శూన్యం అన్నావే..
ప్రసవ వేదన కంటే తీయని బాధని నాకు పరిచయం చేసెళ్లిపోయావే...

మరు జన్మంటూ ఉంటే అది నీతోనే అన్నావే..
కలిసి బ్రతకాల్సిన ఈ జన్మలో మాత్రం నన్ను ఒంటరి చేసి నీ దారి నువ్వు చూసుకున్నవే...

నీ తోడు ఎపుడూ వీడను అని ముద్దు ముద్దు మాటలతో నా చెవులకి ఊసులయ్యావే..
మరపు రాని, తిరిగి రాణి జ్ఞాపకాలను నాకు అందించి నీ ప్రపంచం నుండి నన్ను అమాంతం తోసేసావే...

నా ప్రతి అడుగులో నా వెంటే ఉంటానని అడగకనే నాకు మాటిచ్చావే..
నా ప్రేమని కాదనుకొని నీ అడుగులకి అంటుకున్న మట్టి లాగా నన్ను ఏ మాత్రం జాలి లేకుండా కడిగేసావే...

నా కనుల అంధత్వానికి చిరువెలుగువి నువ్వయ్యా అయ్యావే...
మరేంటి ఇపుడు ఈ ప్రాణం లేని నా కళ్ళని ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో నన్ను పడేసావే...

నేనడిగే ప్రతి ప్రశ్నకి జవాబు నువ్వైతాను అన్నావే..
చివరికి అంతుచిక్కని సమాధానం ఎంత వెతికినా దొరకని ప్రశ్నగా మిగిలిపోయావే...

నా స్నేహానికి నీ ప్రేమ ఒక ఊరట అని మురిపించావే..
ఊరించి ఊరించి మనసు మార్చుకొని వూరు వదిలి వెళ్ళిపోయావే...

రోజులు భారంగా మారుతున్న రోజుల్లో నీ భరోసా నేను అనేసావే..
హృదయం నిండుగా నువ్వే ఉన్నా ఈ తీపి భారంతో నను ముందుకెళ్ళకుండా నిలిపేసావే...

నీ బ్రతుకు బండిలో ఒక చక్రం నేనై నిను నడిపిస్తాను అన్నావే..
చలించని నీ హృదయంతో నా బ్రతుకుని చెల్లాచెదారం చేసేసావే...

నా పసి మనసుని ఇట్టే పసిగట్టి నా బుడి బుడి నడకలలో ఎనలేని మార్గదర్శివి అయ్యావే..
మౌనంతో మదిని కప్పేసి నను నట్టనడిమధ్యనే వదిలేశావే...

నీవేగా నా గుండెలో శ్రుతీ లయా అంటూ మురిసిపోయావే..
బాసటగా నిలవాల్సిన సమయంలో నను పూర్తిగా లయ తప్పేలా చేసావే...

ప్రతి రోజూ మెలకువ ఉంటూ నీ కలలే కంటున్నా అన్నావే..
మరపురాని మరువలేని కళల సామ్రాజ్యంలో నను ఏకాకిగా పోరాడామని చెప్పలేక నీ మౌనమనే బాణాన్ని నా పై సంధించావే...

వెచ్చటి వెన్నెల్లో పచ్చటి తోటల్లో పూల పాన్పుపై పవళిస్తూ పలికే చిలిపి మాటలే చాలు అన్నావే..
మరో రోజంటూ లేదంటూ మాటల వంతెనని కూల్చి హాయిగా సేద దీరావే...

నింగిలో ఆ చుక్కలన్నిటి సాక్షిగా మనం ఒక్కటవుదామని పదే పదే ముచ్చట పడ్డావే..
నా చెలి పలుకులని ఆస్వాదించేలోపే పంజరంలో పిట్టలా ఎగిరిపోయావే...

కమ్మని నీ 'ఇంకేంటి' అనే మాట కోసం నా హృదయం పదే పదే పరితపిస్తుందే..
అది ఆగిపోయేలోపైనా నను ఒకసారైనా వచ్చి హత్తుకోవే...

ఓ ప్రియా, నా ప్రాణంకి ఉత్సాహం నీ శ్వాస తగిలిన ఆ మధుర క్షణం..
నిను ప్రేమిస్తూనే ఉంటానే అంతులేని ఈ ప్రయాణం లో అలుపెరగని బాటసారిలా అనుక్షణం...! 

అలసి సొలసిన నా ఈ ప్రాణానికి ఒక సంజీవనివి అవుతావని ఆశీస్తూ..
సదా నీ సంతోషం కోసం ఏమైనా చేయడానికి నేను వెనుకాడనని ప్రియా...!!

P.S. Fourteen years later, the memories remain, the questions are unanswered, and the love has learned to live in silence. Sometimes, the hardest goodbye is the one that was never spoken. ❤️‍🩹

-©️®️✍️Mr.VRites (Rahul Vemula)

No comments:

Post a Comment