అమ్మ కోసం ..
........................................................................అమ్మ అంటే దైవం అంటారు కదా..
అనాథలకు అమ్మ ఉండదు కదా..
మరి వాళ్ళు దేవుడనే నమ్మకాన్ని వీడరు కదా..
దేవుడే అమ్మ అయితే మరి ఆ దేవుడు కూడా ఒక అమ్మ నుంచి వచ్చినోడే కదా..
ఇలా ఎన్నో ప్రశ్నలు నా మదిలో ఎవరో ఏవో భాణాలని సంధిస్తున్నట్లు ఉండగా..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
ప్రతి నిమిషం నాతో ఉండవు కదా అమ్మ..
అయినా ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తావే అమ్మ..
నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళనని చిన్ననాటి నుండి నీకు తెలుసు కదా అమ్మ..
బడి గంటలు మ్రోగే వరకు నాతోనే ఉంటూ నా వెన్ను తట్టి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చావే అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
కొన్నిసార్లు దెబ్బలు తిన్నపుడు కోపం వచ్చింది అనే మాట నిజమే కానీ..
చివరకి అవన్నీ జీవిత పాఠాలు అయ్యాయే తప్ప నీ మీద వచ్చిన కోపానికి ఏ మాత్రం ఆయువు పోయలేదు కదా అమ్మ..
ఎపుడూ అనుకుంటూ ఉంటాను నా ఆనందం లో, బాధల్లో నువ్వు అప్పుడప్పుడు ఎందుకు గుర్తుకురావో అని..
అసలు మర్చిపోవడమేంటి, నా వెన్నంటే నా తోడువై నడిచేది, నను నడిపించేది నువ్వే కదా అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
నా ఇష్టాలని నీ ఇష్టాలు గా భావించావే..
చిన్ని చిన్ని ఆనందాలకు తెగ మురిసిపోయావే..
పసివాడిలా ఉన్నప్పటి నుండి నిన్ను గమనిస్తున్నా అమ్మ..
ఎందుకమ్మా మా సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూనే ఉన్నావు అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
తెలిసి తెలియని వయసు లో భయంతో పక్కని తడిపే అలవాటు ఉన్న నాకు నువ్వే ఒక ధైర్యం అయ్యావే..
అందుకోసం నీ నిద్రని కూడా లెక్క చేయకుండా కాచుకొని కుర్చున్నావే అమ్మ..
ఇపుడేమో నా 'గుండెలోని గాయం' చూసి నన్ను అక్కున చేర్చుకున్నావే అమ్మ..
అసలైన ప్రేమ అమ్మదే కానీ 'ఆ అమ్మాయిది' కాదని నీ ప్రేమతో నాకు తెలిసొచ్చేలా చేసావే..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
నేను పుట్టక ముందు తొమ్మిది నెలలు నా భారాన్ని ఎంతో ఓర్పుతో మోసినావే..
ఇక నుంచైనా నీ భారాన్ని కాస్త నాకు అప్పగించవే అమ్మ..
ప్రాణం పోసిన అమ్మ కోసం పగలు రాత్రి కష్టపడి ఎదో చేయాల్సిన పని లేదే..
ఎంతో బిజీగా ఉన్నా అని సాకులు చెప్పకుండా రోజుకు ఒక పది నిమిషాలు అమ్మ కోసం కేటాయించి చూడు అమ్మ ఆనందానికి అవదులు ఉంటాయేమోనని..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
నీకేమి పోతుందిలే ఇలా చిటుక్కున మాయమయ్యి అలా బయట పడతావు..
ఇంట్లో అమ్మేమో నువ్వెప్పుడు తిరిగి ఇంటికి వస్తావో అని అనుక్షణం బెంబేలెత్తిపోతుంది..
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నీ బాగు కోసం అమ్మ మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు..
అయినా అమ్మని చులకనగా చూస్తావే..అమ్మే కదా నీకు ఆశీర్వాదము..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
కడుపులో నువ్వు తన్నినా ఓర్చుకుందే తప్ప నాకీ బిడ్డ వద్దు అని ఏనాడూ అనలేదే..
కంటికి రెప్పలా అనునిత్యం నన్ను కాపాడుకుంటూ వస్తూనే ఉన్నవే అమ్మ..
చిలిపి కృష్ణుడివని నాకు నందకిశోరుడని పేరు పెట్టావు కదే..ఆ పేరు పెట్టాకే నా అల్లరి ఇంకాస్త పెరిగింది అన్నవే..
నా చిట్టి చిట్టి మాటలని అర్ధం చేసుకుంటూ నాకు మొదటి గురువువి నువ్వే అయ్యావే అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
రక్తాన్ని రత్తం అని, ఎక్కొస్తలేదు దిగొస్తాలేదుని ఎక్కరొత్తలేదు, దిగరొత్తలేదు అని చిన్నపుడు అనే వాడిని అని అన్నవే..
నేను అలిగినపుడు లేదా కోపంగా ఉన్నపుడు అవి గుర్తుతెచ్చుకొని మరీ మరీ నవ్వుకుంటూ ఉంటాం కదే అమ్మ..
నిద్ర లేసిన క్షణం నుండి అస్తమించే వరకు నేను ఆ రోజు చేసిన మంచి, చెడుల గురించి విశ్లేషించే ఒక మంచి మిత్రుడివై సలహాలు సూచనలు ఇచ్చావే..
స్వార్ధమే లేని ప్రేమ, మనసుకి హత్తుకుపోయే మమకారం, ఎన్నటికీ ఆవిరి అవ్వని ఆప్యాయత ఇంకా ఎన్నెన్నో కలగలిపితే అదే మా అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
నేను కడుపులో ఉన్నపుడు నువ్వు పడ్డ కష్టాలను పదే పదే నాకు గుర్తు చేస్తూనే ఉంటావు కదా..
ఇక నీకు కష్టం అనే పదం నీ నెత్తురులో కూడా ప్రవహించకుండా చేయాలనేదహీ నా ఆశ అమ్మ..
మాటలు రాని నాకు మాటలతో పాటు మంచి, చెడు కూడా గుర్తించేలా విలువలు నాకందించావు కదా..
ఇంత చేసిన అమ్మవు నాకు కోపమొచ్చి ఎం చేసావు నాకు అని ప్రశ్నని సంధిస్తే మౌనంగా ఉంటావేం అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
అందరి అమ్మలు ఒక్కటే కదా..మన మొదటి స్నేహితులే కదా..
కొందరి అమ్మలకి ఎలా ప్రేమని వ్యక్తపరచాలో తెలియదు అని తెలుసుకోవడానికి నాకు పాతికేళ్ళు పట్టిందే అమ్మ..
నేను చేసిన తప్పులు మన్నిస్తావు కదా..
ప్రేమతో నీ ఒక్కగానొక్క కొడుకు నీకు భరోసా ఇస్తానని, నీ వెంట ఉంటానని, నీ కలలు నా కలలుగా భావిస్తానే అమ్మ..
||అంటూ రాసాను నా ఈ మొదటి కావ్యం అమ్మ కోసం..||
||మా అమ్మ కోసం..||
........................................................................
గమనిక:
నాన్నని తక్కువ చేసి చూపించడానికి కాదు ఈ కావ్యం..
కేవలం అమ్మ లోటు ఎవరూ తీర్చలేరు అని చెప్పడానికే రాసాను మిత్రమా ఈ కావ్యం మా అమ్మ కోసం..
ఎందుకంటే..అమ్మ అనే పిలుపు ఒక మధుర భావం..నా వెంట నువ్వున్నావన్న దైర్యం చాలు అమ్మ..!!
"నాన్న కోసం...." త్వరలో ..
........................................................................
No comments:
Post a Comment